TS news: కేసీఆర్‌ది కపట ప్రేమ: కోమటిరెడ్డి

తాజా వార్తలు

Published : 20/07/2021 01:50 IST

TS news: కేసీఆర్‌ది కపట ప్రేమ: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూప‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బ‌కాయిలు రూ.600 కోట్లు చెల్లించాల‌ని కోరుతూ బ‌హిరంగ లేఖ రాశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే తెరాస సర్కారు.. రైతుల ప‌ట్ల చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుప‌డ‌దు కాబ‌ట్టి ఇక‌నైనా రైతులకు క‌న్నీరు పెట్టించే చర్యలు మానుకోవాల‌ని సూచించారు. 

వానాకాలం పంట ప‌నులు ప్రారంభ‌మై రైతులు నాట్లు వేసుకుంటున్నా.. ఇంకా వరి ధాన్యం కొనుగోలు బ‌కాయి బిల్లులు చెల్లించ‌డం లేదన్నారు. దీనివ‌ల్ల దాదాపు ల‌క్ష మంది రైతులు డ‌బ్బులు రాక ఏమి చేయాలో పాలుపోని ప‌రిస్థితి నెల‌కొందని దుయ్యబట్టారు. రైతుల‌కు రావాల్సిన డ‌బ్బులను మంజూరు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ క‌మీషన్లు వ‌చ్చే ప్రాజెక్టుల‌కు ఆగ‌మేఘాల మీద నిధులు విడుద‌ల చేసి.. రైతుల విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. రైతు బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే.. ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని