నెల్లూరు ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు

తాజా వార్తలు

Updated : 19/01/2021 13:44 IST

నెల్లూరు ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు

కోవూరు: నెల్లూరు జిల్లా ఎస్పీపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పని చేసినంత కాలం ఎస్పీ జాగ్రత్తగా ఉండాలని.. నెలలోపు బదిలీ చేయడం ఖాయమని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఇక్కడ ఉన్నన్ని రోజులు అధికారులు సక్రమంగా పని చేయాలని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం నేతలు చెప్పినట్లు ఎస్పీ వ్యవహరిస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ వ్యవహారాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతానని.. ఎస్పీని డీజీపీ ఏమైనా కాపాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి..

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

ఆ సిలబస్‌తోనే సీబీఎస్‌‌ఈ పరీక్షలు, జేఈఈ, నీట్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని