Krishnapatnam: సోమిరెడ్డిపై కేసు నమోదు

తాజా వార్తలు

Updated : 06/06/2021 13:55 IST

Krishnapatnam: సోమిరెడ్డిపై కేసు నమోదు

నెల్లూరు: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టారు. ఐటీ చట్టం కిందా ఆయనపై కేసు నమోదు చేశారు.

సెశ్రిత కంపెనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై శనివారం సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు కాకాణి కుట్ర చేశారని ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్‌సైట్‌ తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెశ్రిత ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని