Political news: జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌

తాజా వార్తలు

Published : 01/08/2021 01:01 IST

Political news: జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌

దిల్లీ: బిహార్‌లో అధికార  జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌ రంజన్‌కు కేంద్రమంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో లలన్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌సీపీ సింగ్‌కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా స్థానం దక్కడంతో జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. లలన్‌ సింగ్‌ ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. మరోవైపు, కొత్త అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ నియమితులు కావడంతో దిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని