ఆ కూటములు నాణేనికి బొమ్మా బొరుసు: నడ్డా 

తాజా వార్తలు

Published : 04/02/2021 01:35 IST

ఆ కూటములు నాణేనికి బొమ్మా బొరుసు: నడ్డా 

తిరువనంతపురం: కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటమిలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు  వచ్చిన ఆయన తొలి రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లపై ధ్వజమెత్తారు. రెండు కూటమిల్లోనూ అవినీతి ఉందని ఆరోపించారు. కేరళ పట్ల సరైన విజన్‌ లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు.

రెండు అధికారం కోసం ఆరాటపడేవేనని విమర్శించారు. కేరళలో పరస్పరం విమర్శలు చేసుకొనే కాంగ్రెస్‌, వామపక్షాలు.. బెంగాల్‌లో జరగబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు. ఇది సైద్ధాంతిక దివాళాకోరుతనమన్నారు. ప్రజల కోసం కాకుండా అధికారం కోసమే పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ మాజీ ప్రైవేటు కార్యదర్శి ఎం.శివశంకర్‌ ప్రమేయంపై మాట్లాడిన నడ్డా.. అత్యున్నత కార్యాలయం ప్రోత్సాహంతోనే ఈ అవినీతి జరిగిందని ఆరోపించారు.

ఇదీ చదవండి..

చైనా దూసుకొస్తున్నా.. ‘రక్షణ’కు నిధులు పెంచరా?!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని