పునరావాస చర్యలకు ‘మహా’సాయం

తాజా వార్తలు

Updated : 03/08/2021 23:51 IST

పునరావాస చర్యలకు ‘మహా’సాయం

రూ.11,500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర కేబినెట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా మంగళవారం రూ.11,500 కోట్లు మంజూరు చేసింది. దెబ్బతిన్న మౌలిక వసతుల మరమ్మతులతోపాటు వరదల నివారణకు దీర్ఘకాలిక చర్యల కోసం వీటిని ఖర్చు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. జులై 21 నుంచి 23 వరకు కురిసిన అతి భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని రాయగఢ్‌, రత్నగిరి, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడటం తదితర ఘటనల్లో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు లక్షలకుపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ విభాగం మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఎదుట ఈ విషయంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని