‘రాహుల్‌ను తక్షణమే అధ్యక్షుడిని చేయండి’

తాజా వార్తలు

Updated : 01/02/2021 04:53 IST

‘రాహుల్‌ను తక్షణమే అధ్యక్షుడిని చేయండి’

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే తేదీలు నిర్ణయించిన వేళ.. ఆ పార్టీ దిల్లీ యూనిట్‌ కీలక చర్చకు తెరతీసింది. రాహుల్‌ గాంధీని తక్షణమే అధ్యక్షుడిని చేయాలని తీర్మానం చేసింది. దీంతో రాహుల్‌ అధ్యక్ష ఎన్నిక అంశం మరోసారి తీసుకొచ్చినట్లయ్యింది. పార్టీ ఇతర రాష్ట్ర శాఖలు సైతం ఇలాంటి తీర్మానాలు చేసేలా ప్రోత్సహించినట్లయ్యింది.

కాంగ్రెస్‌ పార్టీలో నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఇటీవల భేటీ అయ్యి.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఆ గడువులోపే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను మరీ ఇంత జాప్యం చేయడాన్ని ఓ వర్గం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ దిల్లీ శాఖ తీర్మానం చేయడం గమనార్హం. గతంలోనూ ఒక రాష్ట్ర శాఖను చూసి ఇతర రాష్ట్రాల శాఖలు తీర్మానం చేసిన ఉదంతాలు ఉన్నాయి. 
ఇవీ చదవండి..
దీదీ ఇక ఒంటరే..!
అవినీతి లేని పుదుచ్చేరిని నిర్మిస్తాం: నడ్డా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని