రైతులకు ₹10వేలు.. విద్యార్థులకు ₹10లక్షలు
close

తాజా వార్తలు

Published : 17/03/2021 19:14 IST

రైతులకు ₹10వేలు.. విద్యార్థులకు ₹10లక్షలు

తృణమూల్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి గట్టి పోటీ ఎదురౌతున్న వేళ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. మహిళలకు నెలా నెలా నగదు సాయం, రైతులకు పెట్టుబడి సాయం, విద్యార్థులకు రుణ సదుపాయం వంటి వాటికి మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. మొత్తం 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం  మమతాబెనర్జీ విడుదల చేశారు.

తాము అధికారంలోకి వస్తే చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు ఏడాదికి ఇస్తున్న ₹6వేల సాయాన్ని ₹10వేలకు పెంచుతామని మమత హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు క్రెడిట్‌ కార్డు ఇస్తామని, కేవలం 4 శాతం వడ్డీకే 10 లక్షల వరకు రుణం అందజేస్తామని చెప్పారు. ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.6 కోట్ల మంది మహిళలకు నగదు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జనరల్‌ కేటగిరీ మహిళలకు నెలకు ₹500, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకైతే ₹1000 చొప్పున ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని 50 నగరాల్లో 2,500 ‘మా’ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మమత ప్రకటించారు. ఏటా 10 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేస్తామని, రాబోయే ఐదేళ్లో 10 వేల పెద్దతరహా పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మెడికల్‌ సీట్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల పెంపు, తక్కువ ధరకే ఇళ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం, 24 గంటల విద్యుత్‌ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. రేషన్‌ను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని మమత  చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని