కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!
close

తాజా వార్తలు

Published : 13/04/2021 13:39 IST

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం తనపై 24 గంటల ప్రచార నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఈ చర్యకు పూనుకున్నారు. కోల్‌కతాలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఆమె ధర్నాకు బైఠాయించారు. ఈసీ తనపై ఆంక్షలు పెట్టడాన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. సాయుధ దళాలకు వ్యతిరేకంగా ప్రకటనలు, ఓట్ల అభ్యర్థనలో మత ప్రస్తావన వంటి ఆరోపణల నేపథ్యంలో దీదీపై ఒకరోజు ప్రచార నిషేధం విధిస్తూ ఈసీ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ చర్యను దీదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని