Mamata Banerjee: మాకు కూడా ట్విటర్ పరిస్థితే..
close

తాజా వార్తలు

Published : 17/06/2021 18:07 IST

Mamata Banerjee: మాకు కూడా ట్విటర్ పరిస్థితే..

కేంద్రంపై మండిపడ్డ దీదీ

కోల్‌కతా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ను ధ్వంసం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వానికి కూడా కేంద్రం నుంచి అదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు. 

‘నేను దీన్ని ఖండిస్తున్నాను. వారు ట్విటర్‌ను అదుపు చేయలేరు. అందుకే దాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారు కట్టడి చేయలేని ప్రతి ఒక్కరితో ఇలాగే ప్రవర్తిస్తారు. వారు నన్ను నియంత్రించలేరు. అందుకే నా ప్రభుత్వాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని మమత మీడియా చెంత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో ట్విటర్‌పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. దాంతో ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్ హార్బర్)అనే రక్షణ కవచాన్ని ఆ సామాజిక మాధ్యమం కోల్పోయింది.

ఇదిలా ఉండగా..బెంగాల్‌లో రాజకీయ హింస కొనసాగుతున్నట్లు భాజపా చేసిన ఆరోపణలపై మమత స్పందించారు. ఇది కమలం పార్టీ జిమ్మిక్‌ అని, ఆ వ్యాఖ్యలన్నీ పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. ‘రాష్ట్రంలో రాజకీయ హింస జరగడం లేదు. ఒకటి లేదా రెండు.. అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరిగిఉండొచ్చు. కానీ వాటిని రాజకీయ హింసాత్మక ఘటనలుగా చిత్రీకరించలేము’ అంటూ భాజపా ఆరోపణలను తోసిపుచ్చారు.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని