‘దీదీ ఓడిపోతున్నారు.. అందుకే డ్రామా!’ 

తాజా వార్తలు

Published : 01/04/2021 21:20 IST

‘దీదీ ఓడిపోతున్నారు.. అందుకే డ్రామా!’ 

నందిగ్రామ్‌: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోబోతున్నారని, పబ్లిసిటీ కోసమే ఆమె నాటకాలాన్నారంటూ ఆమె ప్రత్యర్థి, భాజపా నేత సువేందు అధికారి విమర్శించారు.  కొన్నిగంటల ముందు దీదీ వెళ్లడంతో ఉద్రిక్తంగా మారిన బోయల్‌ పోలింగ్‌ బూత్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ.. ‘మమతకు నందిగ్రామ్‌లో ఎలాంటి మద్దతూ లేదు. ఎన్నికల్లో ఆమె ఓడిపోతారు. మమత ఇక్కడి ఓటింగ్‌ను రెండు గంటల పాటు నిలిపివేశారు. నందిగ్రామ్‌లో దాదాపు 90శాతం ఓటింగ్ జరిగితే.. ఇక్కడ మాత్రం ఇంకా 78 శాతమే నమోదైంది. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బందీ లేదు. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ సువేందు వేవ్‌ కొనసాగుతోంది. మమత ఎక్కడాలేరు. పబ్లిసిటీ కోసం ఆమె నాటకాలాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

రెండో విడత ఎన్నికల్లో తాను పోటీచేస్తున్న నందిగ్రామ్‌లో బోయల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. రిగ్గింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని ఓటు వేయకుండా స్థానికులను అడ్డుకుంటున్నారని దీదీ ఆరోపించారు. బోయల్‌ ప్రాంతంలోని ఏడో నంబర్‌ పోలింగ్‌ కేంద్రం నుంచి ఆమె నేరుగా గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని