Mukul Roy: ‘జడ్‌ కేటగిరీ’ వెనక్కి
close

తాజా వార్తలు

Published : 17/06/2021 14:34 IST

Mukul Roy: ‘జడ్‌ కేటగిరీ’ వెనక్కి

ఇటీవలే భాజపా నుంచి సొంతగూటికి చేరిన నేత

దిల్లీ: భాజపాను వీడి సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌కు గురువారం కేంద్రం జడ్ కేటగిరీ రక్షణను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ వర్గాలు మీడియాకు ధ్రువీకరించాయి. 

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముకుల్ రాయ్‌ తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ) నుంచి బయటకు వచ్చి భాజపా కండువాను కప్పుకున్నారు. టీఎంసీ వర్గాల నుంచి ముప్పు పొంచి ఉందని పేర్కొంటూ..హోం శాఖ ఆయనకు జడ్‌ కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ ఎన్నికల్లో తృణమూల్ విజయం సాధించింది. అప్పటి నుంచి భాజపా కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాయ్‌..ఇటీవల సొంతగూటికి చేరారు. తనకు ఇస్తోన్న కేంద్ర బలగాల భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీలో చేరిన వెంటనే ఆయన హోంశాఖకు లేఖ రాశారు. గత వారం ఆయన కుమారుడు సుబ్రాన్షుకు ఇస్తోన్న రక్షణను కూడా వెనక్కి తీసుకుంది. వారి కోరికపైనే సిబ్బందిని వెనక్కి రప్పించినట్లు పారామిలిటరీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు వీరికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. 

మరోపక్క ఆ రాష్ట్రానికి చెందిన 70మందికి పైగా భాజపా ఎమ్మెల్యేలకు హోంశాఖ కేంద్ర పారామిలిటరీ రక్షణను అందిస్తోంది. టీఎంసీ నుంచి ముప్పు పొంచి ఉందన్న నెపంతో వారికి ఈ రక్షణ కల్పిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని