విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు: బొత్స

తాజా వార్తలు

Updated : 30/06/2021 14:58 IST

విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు: బొత్స

అమరావతి: జల వివాదంపై రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తే తెలంగాణ నాయకులకు అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నీటి కేటాయింపులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ చేపడుతున్నామని.. త్వరలోనే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు ప్రారంభించి రైతులకు ప్లాట్లు అందిస్తామని వెల్లడించారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నారు. జలాల అంశంపై కృష్ణా బోర్డుకు సహకరిస్తామన్నారు. ‘‘మా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొలేదు. విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయి. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి’’ అని బొత్స అన్నారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని