వైద్యారోగ్య శాఖ బదిలీపై స్పందించిన ఈటల
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 16:13 IST

వైద్యారోగ్య శాఖ బదిలీపై స్పందించిన ఈటల

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్‌కు బదిలీ చేయడంపై ఈటల రాజేందర్‌ స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకే ఆ శాఖను తన నుంచి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుందని.. ఏ మంత్రినైనా తొలగించే అధికారం కూడా ఆయనకు ఉంటుందన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుంటానని ఈటల స్పష్టం చేశారు.

ఓ ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఈటల ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఎకరాలు ఆక్రమించి షెడ్లు కట్టినట్లు చెబుతున్నారని.. వాస్తవాలన్నీ బయటకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రజలే అసహ్యించుకుంటున్నారని.. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో ఇప్పటివరకు మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. ఇకపై చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే హుజూరాబాద్‌ నియోజకవర్గ నాయకులు, శ్రేణులతో చర్చించిన తర్వాతే మాట్లాడతానని వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని