తెలంగాణకు వచ్చి మొసలి కన్నీరా?: హరీశ్‌

తాజా వార్తలు

Published : 11/02/2021 01:42 IST

తెలంగాణకు వచ్చి మొసలి కన్నీరా?: హరీశ్‌

సిద్దిపేట: తెలంగాణకు ఎవరో వచ్చి రైతుల పరిస్థితి బాగోలేదంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో పరోక్షంగా ఆమెపై విమర్శలు చేశారు. రైతు సంక్షేమానికి తెలంగాణలో అమలవుతున్న పథకాల పట్ల వారికి అవగాహన ఉందా? అని నిలదీశారు. 

ఏపీలో రైతులకు ఇచ్చే నిధుల కన్నా తమ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో రైతుకి ఇచ్చేది కేవలం రూ.12,500 అని.. తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై రైతులు ఆలోచించాలని కోరారు.

ఇవీ చదవండి..

షర్మిల పార్టీ నిలబడదు: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణలో సమర్థ నాయకత్వం అవసరం: కృష్ణదాస్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని