ఎస్‌ఈసీ ఆదేశాలపై కొడాలి హౌస్‌మోషన్‌ పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 14/02/2021 20:25 IST

ఎస్‌ఈసీ ఆదేశాలపై కొడాలి హౌస్‌మోషన్‌ పిటిషన్‌

అమరావతి: మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు గంటన్నర పాటు ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులను సమర్పించాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికల కమిషర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు.

ఇవీ చదవండి..

‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

హైదరాబాద్‌ చేరుకున్న అరకు ప్రమాద మృతులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని