close

తాజా వార్తలు

Updated : 06/03/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్

హైదరాబాద్‌: ప్రతికూల పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని స్థాపించారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస విద్యార్థి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 27 నాటికి తెలంగాణ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతుందన్నారు. పార్టీని స్థాపించిన సమయంలో కేసీఆర్‌కు మీడియా, మనీ, మజిల్‌ పవర్‌ ఏమీ లేదని గుర్తు చేశారు. నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణను సాధించారని కొనియాడారు. అయితే కొందరు సీఎం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గోడకు వేలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని.. సమయం వచ్చినప్పుడే తుపాకీ విలువ తెలుస్తుందన్నారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని కేటీఆర్‌ హెచ్చరించారు. భాజపా నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆరేళ్ల పాలనలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ వస్తుందని ఆరోపించారు. భాజపా నేతల అసత్య ప్రచారాలను విద్యార్థి విభాగం నేతలు తిప్పికొట్టాలని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు.

‘‘వాట్సాప్‌ వర్సిటీలో భాజపా నేతలు అబద్ధాలు నేర్చుకుంటున్నారు. వాట్సాప్‌ను ఉపయోగిస్తూ భాజపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం చేసింది సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు ఇవ్వడం లేదు. కొత్త వైద్య కళాశాలల్లో తెలంగాణకు మొండి చేయి చూపించారు. అలాంటి భాజపాకు ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. దూషణలు చేస్తున్న వారికి సరైన సమయంలో బదులిస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని