తెలంగాణ‌కు భాజ‌పా ఏం చేసింది?: నిరంజ‌న్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 05:01 IST

తెలంగాణ‌కు భాజ‌పా ఏం చేసింది?: నిరంజ‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌: త్యాగాల తెలంగాణ‌కు భాజ‌పా ఏం చేసింది? అని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపింద‌ని.. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి కేటాయించింద‌ని ఆక్షేపించారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్ర‌భుత్వం కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ర‌ద్దు చేసింద‌న్నారు. విభ‌జ‌న హామీలు కూడా అమ‌లు చేయ‌లేద‌ని నిల‌దీశారు. గిరిజ‌న వ‌ర్సిటీ, రైల్వే కోచ్ ఏమ‌య్యాయ‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించ‌లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. న‌గ‌రీక‌ర‌ణ‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌కు కేంద్రం నుంచి ప్రోత్సాహం లేద‌న్నారు. ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ నీటి వాటా తేల్చ‌లేద‌ని నిరంజ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్రాజెక్టుల‌తో ప్ర‌జ‌లకు బ‌తుకుదెరువు క‌ల్పించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పంజాబ్‌ను త‌ల‌ద‌న్ని వ‌రి ఉత్ప‌త్తిలో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని