అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి 

తాజా వార్తలు

Updated : 06/02/2021 13:17 IST

అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి 

తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. అలా చేసిన వాళ్లని తమ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని చెప్పారు. ఏకగ్రీవాలపై ధ్రువపత్రాలివ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవని పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను ఆయన హెచ్చరించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు.

‘‘జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనల్ని తప్పక పాటించాలి. అధికారులను ఎస్‌ఈసీ భయపెడుతున్నారు. ఆయన తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టకూడదని నిబంధనల్లో ఎక్కడుంది? గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదా? కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవమైతే ఎస్‌ఈసీకి ఎందుకు బాధ? ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు జిల్లాల పర్యటనలా? పదవీ విరమణ చేశాక నిమ్మగడ్డను చంద్రబాబు అస్సలు పట్టించుకోరు. మేం ఏమీ అనకుండానే తనతో పాటు బొత్స సత్యనారాయణపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారు. ఓటు నమోదు కూడా తెలియని వ్యక్తి నిమ్మగడ్డ. ఎస్‌ఈసీని గౌరవించాల్సిన అవసరం లేదు.. ఆదేశాలు వినాల్సిన అవసరమూ లేదు’’ అంటూ పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 

ఇవీ చదవండి..

జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భార్యను చంపేశాడు!

‘కృష్ణా బోర్డు విశాఖకు వెళ్లడం ఖాయం’Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని