సునీల్‌ దేవ్‌ధర్‌కు పేర్ని నాని కౌంటర్‌
close

తాజా వార్తలు

Published : 09/04/2021 18:19 IST

సునీల్‌ దేవ్‌ధర్‌కు పేర్ని నాని కౌంటర్‌

తిరుపతి: రాష్ట్రంలోని థియేటర్లలో నాలుగు షోలకే అనుమతి ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. వకీల్‌సాబ్‌ సినిమా టికెట్‌ ధర గురించే భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ గొడవ చేశారన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వకీల్‌సాబ్‌ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధమేంటని నాని ప్రశ్నించారు. ‘‘పువ్వు గుర్తుకు ఓటెయ్యమంటూ చెవిలో పువ్వులు పెడతారా?వకీల్‌సాబ్‌ను చూసి జగన్‌ భయపడుతున్నారని అంటారా?సోహ్రాబుద్దీన్‌ కేసులో అమిత్‌షా ఎవరికి భయపడుతున్నారు?’’ అని సునీల్‌ దేవ్‌ధర్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

తిరుపతిలో వకీల్‌సాబ్‌ సినిమా బెనిఫిట్‌ షోలు ఎందుకు రద్దు చేశారంటూ నగరంలోని జయశ్యామ్‌ థియేటర్‌ వద్ద భాజపా శ్రేణులు నిరసన తెలిపాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్‌ దేవ్‌ధర్‌.. పవన్‌కే కాకుండా ఆయన సినిమాకూ సీఎం జగన్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేవ్‌ధర్‌కు పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని