తెరాస విజయం సునాయాసం: పువ్వాడ అజయ్‌

తాజా వార్తలు

Updated : 25/04/2021 11:01 IST

తెరాస విజయం సునాయాసం: పువ్వాడ అజయ్‌

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెరాస విజయం సునాయాసమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నగరానికి రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన తెరాసను నగర ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఖమ్మంలో మనుగడ లేదని.. ఖమ్మం కార్పొరేషన్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు.

‘‘ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అన్ని డివిజన్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అన్ని కులాలు, వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేశాం. ఎక్కడా కూడా రెబల్స్‌ లేరు. అన్ని చోట్ల నేతలు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. అభ్యర్థులకు విజయం సునాయాసంగా లభిస్తుంది. తెరాసకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసిన తర్వాత ప్రతిపక్షాలను బెదిరించాల్సిన అవసరం తెరాసకు లేదు. మరోసారి ప్రతిపక్షాలను తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని