సీఎల్పీ నేత భట్టి ఇంటికి మంత్రి తలసాని

తాజా వార్తలు

Updated : 17/09/2020 12:11 IST

సీఎల్పీ నేత భట్టి ఇంటికి మంత్రి తలసాని

హైదరాబాద్‌: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..రాష్ట్ర మంత్రి తలసాని వెంట రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు వెళ్లారు. నిన్న శాసనసభలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణంపై ఇరువురు నేతల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తాయని భట్టి విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో లక్ష డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని సవాల్‌ విసిరారు.  భట్టి సవాల్‌ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిర్మాణాలను స్వయంగా చూపిస్తానని స్పష్టం చేశారు. ఆమేరకు గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని.. మేయర్‌ రామ్మోహన్‌తో కలిసి వెళ్లారు. శ్రీనివాస్‌ యాదవ్‌ కారులోనే ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు ఇరువురు నేతలు వెళ్లారు. తొలుత జియాగూడలోని ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని