భాజపాలో చేరిన మిథున్‌ చక్రవర్తి

తాజా వార్తలు

Updated : 07/03/2021 15:53 IST

భాజపాలో చేరిన మిథున్‌ చక్రవర్తి

కోల్‌కతా: బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తి భాజపాలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. బెంగాల్‌ భాజపా రాష్ట్రశాఖ బాధ్యులు కైలాష్‌ విజయవర్గీయ, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఝోష్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన చేరికకు ప్రాధాన్యం ఏర్పడింది. కైలాష్‌ విజయవర్గీయ శనివారమే మిథున్‌ చక్రవర్తితో భేటీ అయి చర్చలు జరిపారు.

మిథున్‌ చక్రవర్తికి బెంగాల్‌లో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. 2006లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ‘ఎంఎల్‌ఏ ఫలాకేష్టో’ ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. తర్వాత ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కానీ, శారదా కుంభకోణం కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని