ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు: ఆర్కే

తాజా వార్తలు

Updated : 11/07/2021 14:58 IST

ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు: ఆర్కే

మంగళగిరి: రాంకీ గ్రూప్‌ షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఖండించారు. సంస్థలో తన పేరిట ఉన్న 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనని ఆయన స్పష్టం చేశారు.
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాంకీ గ్రూప్‌ కంపెనీల్లో వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని తెదేపా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నిన్న ఆరోపించారు. తన అన్న అయోధ్య రామిరెడ్డి కంపెనీల్లో తమ్ముడు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగస్వామిగా 12 వేల షేర్లున్నాయని చెప్పిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని