
తాజా వార్తలు
అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం
వెంకటగిరి: నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై వైకాపాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇది పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో ఆనం మాట్లాడారు. అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని.. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనకాడబోనని హెచ్చరించారు. యంత్రాంగం తీరుపై తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేల పాత్ర ప్రహసనంగా మారిందంటే సిగ్గుపడాలా? బాధపడాలా? అనే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇవీ చదవండి..
నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిట్మెంట్ పేరుతో కొత్త డ్రామా: బండి సంజయ్