ఇలాగే చేస్తే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం: బాలకృష్ణ

తాజా వార్తలు

Published : 09/01/2021 01:03 IST

ఇలాగే చేస్తే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం: బాలకృష్ణ

హిందూపురం: రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తెదేపా నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని బాలకృష్ణ హెచ్చరించారు. హిందూపురం నియోజకవర్గంలో మూడోరోజు బాలకృష్ణ పర్యటన కొనసాగింది. పట్టణ పరిధిలో తెదేపా హయాంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి బాలకృష్ణ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు అనువుకాని చోట దూరప్రాంతాల్లో స్థలం ఇచ్చి అన్యాయం చేస్తుందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..
ఆలయాల పునఃనిర్మాణానికి జగన్‌ భూమిపూజ

 

వినాయక విగ్రహం అపహరణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని