raja singh: గోషామహల్‌కు ప్యాకేజీ ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా!

తాజా వార్తలు

Updated : 02/08/2021 14:27 IST

raja singh: గోషామహల్‌కు ప్యాకేజీ ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా!

హైదరాబాద్‌: తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దయ చేసి తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుకు వస్తారు. హుజూరాబాద్‌లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించండి. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ రాజా సింగ్‌ వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని