‘పీసీసీ రాకుంటే రేవంత్‌ పార్టీ మారే వారు’

తాజా వార్తలు

Updated : 03/07/2021 17:33 IST

‘పీసీసీ రాకుంటే రేవంత్‌ పార్టీ మారే వారు’

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాళ్లతో కొడితే.. తెరాస కార్యకర్తలు చెప్పులతో కొడతారని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు రేవంత్‌రెడ్డి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని తీవ్రంగా విమర్శించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి.. ఇంట్లో రెవెన్యూ టీంను ఉంచుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులిచ్చి కీలక పదవులు పొందిన రేవంత్‌ తెరాసను విమర్శించడం ఏంటని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకుంటే రేవంత్‌ పార్టీని వీడేవారని చెప్పారు. కొనుక్కున్న పదవులను చూసి మిడిసిపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదని.. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలే రోజు తప్పకుండా వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల అభీష్టానికి దూరంగా వెళ్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి ఉన్నవాళ్లకు న్యాయం జరగటం లేదన్నారు. ఎన్ని మాటల గారడీలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు.

గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని ఒక ఎంపీ అనడం అత్యంత దారుణమన్నారు. అనేక వివాదాల మధ్య రేవంత్‌కు పీసీసీ పదవి దక్కిందన్నారు. రేవంత్‌రెడ్డి.. నిషేధిత మావోయిస్టుల భాషలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని