వైకాపాకు కూల్చడం తప్ప కట్టడం తెలీదు

తాజా వార్తలు

Updated : 13/06/2021 15:04 IST

వైకాపాకు కూల్చడం తప్ప కట్టడం తెలీదు

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖ: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపించాలని.. లేకుంటే మంత్రి అవంతి శ్రీనివాస్‌ క్షమాపణ చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్‌ చేశారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూల్చడం తప్ప కట్టడం ఈ ప్రభుత్వానికి తెలియదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూముల తాకట్టుపై ప్రజలు మేల్కోవాలని, లేకుంటే ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. పల్లా శ్రీనివాసరావు భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో నిర్మాణాలను కూలగొడుతున్నారని.. ప్రభుత్వ సర్వేయర్లతో స్థలంలోకి వెళ్లి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూమిని పల్లా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే పల్లా రాజకీయాలకు దూరమవుతారని.. లేకపోతే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పరువు దిగజార్చారని.. విశాఖలో భూములను తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని