JK: ప్రధాని నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

తాజా వార్తలు

Updated : 24/06/2021 16:31 IST

JK: ప్రధాని నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు చెందిన నేతలతో దిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. నేషనల్ కాన్ఫరెన్స్‌, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీడీపీతో సహా 8 పార్టీలు ఈ సమావేశంలో భాగమయ్యాయి. సమావేశంలో పాల్గొనేందుకు గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, యూసుఫ్ తరిగామి .. తదితర కీలక నేతలు ఇదివరకే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొంటున్నారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసిన అనంతరం జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ నిబంధనను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా.. నేతలంతా కొన్ని నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు ఈ సమావేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే తమ అజెండాను ప్రధాని ముందు ఉంచుతామని జమ్మూకశ్మీర్ నేతలు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని