జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: మిథున్‌
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 10:43 IST

జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: మిథున్‌

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ఆయనకు దెబ్బలు తగల్లేదని.. ఎవరూ కొట్టలేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వైద్యులు పేర్కొన్నారని చెప్పారు. తనను కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని.. బెయిల్ రాలేదని తెలిసే ఆయన కొత్త నాటకానికి తెరతీశారని మిథున్‌రెడ్డి ఆరోపించారు.

తెదేపా నేతలు అరెస్టయినా రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాయలేదని.. పెద్ద కుట్రతోనే ఆయన ఇప్పుడు లేఖ రాశారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్నారు. ఈ వ్యవహారాలను లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని మిథున్‌రెడ్డి చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని