ఆ ఇళ్లు పేదలకెందుకివ్వరు?: రఘురామ

తాజా వార్తలు

Updated : 29/06/2021 10:48 IST

ఆ ఇళ్లు పేదలకెందుకివ్వరు?: రఘురామ

దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘నవ సూచనలు’ పేరుతో ఆయన ఇవాళ మళ్లీ లేఖాస్త్రం సంధించారు. జగనన్న కాలనీలు, పక్కా ఇళ్ల విషయంపై అందులో పేర్కొన్నారు. అత్యంత చౌకబారు నిర్మాణ సామగ్రి ఉపయోగించి కనిష్ఠ సౌకర్యాలు, అరకొర మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదవారికి ఇవ్వొద్దన్నారు.
స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రజల దీర్ఘకాలిక సంతోషాన్ని హరించవద్దని పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు నాసిరకం ఇళ్లు ఇచ్చి వారి డబ్బు, ఆరోగ్యం అన్నింటికి మించి వారి సంతోషాన్ని దూరం చేయొద్దని రఘురామ కోరారు. అమృత్‌ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదవారికి ఎందుకు ఇవ్వడం లేదు?అని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని