‘ప్రతిపక్షనేత ప్రజల్లోకి వెళ్తుంటే భయమెందుకు?’

తాజా వార్తలు

Published : 01/03/2021 18:32 IST

‘ప్రతిపక్షనేత ప్రజల్లోకి వెళ్తుంటే భయమెందుకు?’

ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళుతుంటే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలిచామంటున్న వైకాపా పెద్దలు.. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో భయపడేందుకు కారణమేంటని నిలదీశారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సీఎం జగన్‌కు ఆయన సూచించారు. ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకుంటున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనపై పెట్టిన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని కోరానని.. వాటిపై కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేస్తానని ఆయన చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని