Raghurama: గజేంద్రసింగ్‌తో రఘురామ భేటీ

తాజా వార్తలు

Updated : 09/06/2021 16:16 IST

Raghurama: గజేంద్రసింగ్‌తో రఘురామ భేటీ

దిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని.. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

గతనెల 14న ఏపీ సీఐడీ పోలీసుల దాడి వివరాలు కూడా గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రఘురామ తెలిపినట్లు సమాచారం. పోలవరం అంశంతో పాటు తనపై దాడి వివరాలను పేర్కొంటూ రెండు వేర్వేరు లేఖలు కేంద్రమంత్రికి అందజేసినట్లు తెలిసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని