Raghurama: ఆ మాట వైకాపా సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

తాజా వార్తలు

Updated : 12/07/2021 15:01 IST

Raghurama: ఆ మాట వైకాపా సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

నేను చేసిన తప్పేంటి?: రఘురామకృష్ణరాజు

దిల్లీ: దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఈ విషయంలో తమ ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు.

‘‘దేవాలయాలపై దాడిని నిరసిస్తున్నాను అని నేను చెప్పడం వైకాపా సిద్ధాంతాలకు వ్యతిరేకమా?  నా అభిప్రాయాలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? నేనేమైనా తప్పు చేశానా? నాపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌కు కారణమేంటి?పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేస్తారా?’’ అని ఆయన నిలదీశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని