ఆ సంగతి జగన్‌కు తెలియంది కాదు: రఘురామ

తాజా వార్తలు

Published : 02/07/2021 10:41 IST

ఆ సంగతి జగన్‌కు తెలియంది కాదు: రఘురామ

దిల్లీ: జగన్‌, కేసీఆర్‌ రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవసూచనల పేరిట ఏపీ సీఎం జగన్‌కు ఆయన మరో లేఖ రాశారు. నదీ జలాల అంశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్‌.. జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు.  తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు తెలియంది కాదని.. తక్షణం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలను పరిష్కరించాలని రఘురామకృష్ణరాజు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని