AP News: మా సహనాన్ని పక్కన బెట్టి వస్తే మీరు తట్టుకోగలరా?

తాజా వార్తలు

Published : 22/10/2021 18:14 IST

AP News: మా సహనాన్ని పక్కన బెట్టి వస్తే మీరు తట్టుకోగలరా?

వైకాపా నేతలకు రామ్మోహన్‌ నాయుడు సవాల్‌

మంగళగిరి: దాడులను చిరునవ్వుతో స్వీకరిద్దామని శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాబోయే కాలంలో అందరికీ బుద్ధిచెబుతామని హెచ్చరించారు. యువత ఏకపక్షంగా తెదేపాకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘దొంగచాటుగా వచ్చి ఎవరూ లేనప్పుడు దాడిచేశారు. పోలీసుల ఖాకీ డ్రెస్‌ అడ్డంపెట్టుకొని దాడి చేశారు. అదే ధైర్యం ఉంటే ఇప్పుడు రండి. మీరు ఎవరు వస్తారో? ఎంతమంది వస్తారో రండి.. మా కార్యకర్తలకు కర్ర ఇస్తే జెండా కట్టి ఎగరేయడం ఏవిధంగా తెలుసో.. అదే కర్రతో గూండాల భరతంపట్టడమూ తెలుసనేది మేం నిరూపిస్తాం. మా సహనాన్ని  పక్కనబెట్టి ఒక్కసారి ముందుకెళ్తే తట్టుకొనే శక్తిమీకు ఉందా అని వైకాపా నేతల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో, తన ఇంటిపక్కన దాడి జరిగితే ముఖ్యమంత్రి దాన్ని ఎలా సమర్థించుకుంటారో విజ్ఞులైన ప్రజలే ఆలోచించండి. అదే ప్రజాస్వామ్యంపై గౌరవం ఉండి ఉంటే చంద్రబాబుకు ఫోన్‌ చేసి, క్షమాపణ చెప్పి.. మా కార్యకర్తలు చేసినాసరే చర్యలు తీసుకుంటానంటే మీ గౌరవం పదింతలు పెరిగేది. దీక్ష చేస్తున్నామంటే డీజీపీలో మార్పు వస్తుందనో, జగన్‌లో మార్పు వస్తుందనో కాదు.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్ని దాడులు జరిగినా మనలో కసి పెరిగాలే తప్ప ఏ ఒక్కరూ వెనక్కి తగ్గొద్దని పిలుపునిస్తున్నాం’ అని మాట్లాడారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని