‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక’

తాజా వార్తలు

Published : 05/02/2021 02:08 IST

‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక’

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

నిర్మలా సీతారామన్‌కు రామ్మోహన్‌నాయుడు లేఖ

శ్రీకాకుళం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నా వైకాపాలో ఉన్న 28 మంది ఎంపీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. వైకాపా ప్రభుత్వం ప్రైవేటీకరణను అడ్డుకునే చర్యలు చేపట్టకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని కేంద్రాన్ని రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తక్షణమే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

1966 తర్వాత దశాబ్దకాలం పాటు 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారని లేఖలో రామ్మోహన్‌నాయుడు గుర్తు చేశారు. 32మంది తమ ప్రాణాలు అర్పించి, 64 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయటంతో పాటు 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమేనని స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను పార్లమెంట్‌లో అప్పటి ఎంపీ దివంగత ఎర్రన్నాయుడు గట్టిగా అడ్డుకున్నారని.. ఆ స్ఫూర్తితో ఆయన అడుగజాడల్లో నడిచి, ఆంధ్ర ప్రజల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వెనక్కి తగ్గకుండా పోరాడతానని పేర్కొన్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని స్పష్టం చేశారు. నవరత్న హోదావున్న గొప్ప పరిశ్రమ నష్టాల్లోకి రావడానికి గల కారణాలను ఆన్వేషించి లాభాల్లోకి తెచ్చే మార్గాలు సూచించాలని కోరారు. విశాఖ ఉక్కు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని డిమాండ్ చేశారు. 

ఇవీ చదవండి..

జమ్మలమడుగులో పంచాయితీల్లేని ‘పంచాయతీ’! 

ఇకపై హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు నేరుగా..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని