పదవి లేకున్నా విధేయుడిగా పనిచేస్తా: ఉత్తమ్‌

తాజా వార్తలు

Published : 28/06/2021 16:37 IST

పదవి లేకున్నా విధేయుడిగా పనిచేస్తా: ఉత్తమ్‌

హైదరాబాద్‌: తనకు పదవి ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగా పని చేస్తానని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త పీసీసీ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పని చేయాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడుతున్నారని.. కొందరు ఆస్తులు అమ్ముకొని మరీ పార్టీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు ఆరు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉండే అవకాశం కల్పించిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడం పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఉత్తమ్‌ నిరాకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని