AP news: రాయలసీమకు అనుమతివ్వండి

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:08 IST

AP news: రాయలసీమకు అనుమతివ్వండి

గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజయసాయి విజ్ఞప్తి 

దిల్లీ: తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన ఆయన.. కేఆర్‌ఎంబీని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నర్సాపురం ఎంపీ రఘురామపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరినట్లు తెలిపారు. ‘‘నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశాం. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరాం. సీఎం, పార్టీ నేతలపై రఘురామ వ్యాఖ్యలను వివరించాం. రఘురామపై తక్షణమే వేటు వేయాలని విజ్ఞప్తి చేశాం. స్పీకర్‌ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా నిరసన వినిపిస్తాం. స్పీకర్‌ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు ఉంది. ఏడాది గడుస్తున్నా అనర్హతపై నిర్ణయం తీసుకోలేదు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం నిర్ణయం ఆలస్యం చేయకూడదని చెప్పారు.

కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేసుకోవడంతో నీరు వృథా అవుతుందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ నీటి మళ్లింపును నిలిపివేయించాలని, కేంద్ర బలగాలతో ప్రాజెక్టుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని