Mukul Roy: దీదీతో భేటీ.. తిరిగి వచ్చేందుకేనా!
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mukul Roy: దీదీతో భేటీ.. తిరిగి వచ్చేందుకేనా!

కోల్‌కతా: భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి. వాటికి బలం చేకూర్చేలా ఆయన శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశంలో మమతతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తుంటే.. ఆయన తన కుమారుడు సుబ్రాంగ్షు రాయ్‌తో కలిసి తృణమూల్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌కు చెందిన కీలక నేతలంతా భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. వారిలో దీదీకి సన్నిహితులైన సువేందు అధికారి, ముకుల్ రాయ్ వంటి వారున్నారు. అయితే ఆ ఎన్నికల్లో దీదీ భాజపాపై భారీ విజయం సొంతం చేసుకున్నారు. దాంతో పలువురు నేతలు తిరిగి తృణమూల్‌లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క, కరోనాతో చికిత్స పొందుతున్న రాయ్ సతీమణిని పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ ఆస్పత్రికి వెళ్లడం, ఇటీవల కమలం పార్టీ కార్యకలాపాలకు రాయ్‌ దూరంగా ఉండటం తదితర అంశాలతో ఆయన రాక ఖాయమైనట్లు కనిపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని