
తాజా వార్తలు
ఏపీలో ముగిసిన పుర ఎన్నికల ప్రచారం
అమరావతి: ఏపీలో పుర ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా, జనసేన, భాజపాలు ప్రచార పర్వాన్ని కొనసాగించాయి. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి.
ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా 75 పురపాలక సంఘాలు, 11 నగరపాలక సంస్థల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. 12 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా ఏలూరులో ఎన్నికలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 11 కార్పొరేషన్లలోనే పోలింగ్ జరగనుంది. మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టి పుర ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి
Tags :