close

తాజా వార్తలు

Published : 16/08/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరలో కోలుకుంటా.. ప్రజాసేవకు సిద్ధమవుతా!

అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌ 

ముంబయి: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణా కోలుకుంటున్నారు. తనను ఐసీయూ నుంచి ఈ రోజు జనరల్‌ వార్డుకు మార్చారనీ.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు ట్విటర్‌లో వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు తనతో ఉన్నాయన్న నవనీత్‌ కౌర్‌.. త్వరగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు. మళ్లీ ప్రజాసేవకు సిద్ధమవుతానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

తాను కరోనా బారినపడినట్టు ఆగస్టు 6న ప్రకటించిన నవనీత్‌ కౌర్‌.. తొలుత అమరావతిలో ప్రాథమికంగా చికిత్స తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో గురువారం సాయంత్రం ఆమెను ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో వారిని జాగ్రత్తగా చూసుకొనే క్రమంలో తానూ ఈ మహమ్మారి బారిన పడినట్టు నవనీత్‌ కౌర్‌ ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.