
తాజా వార్తలు
నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడ: జనసేన కార్యకర్తల భేటీలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది ఆయన సోదరుడు చిరంజీవేనని చెప్పారు. విజయవాడలో మూడు నియోజకవర్గాల పరిధిలోని జనసేన క్రియాశీల కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్లను మనోహర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి చెప్పిన మాటలను ప్రస్తావించారు. కొద్దికాలం సినిమాలు చేయాలని పవన్‌కు ఆయన సూచించారన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని అంతర్గత భేటీలో చిరంజీవి చెప్పారని మనోహర్ తెలిపారు. నిబద్ధతతో పనిచేసే వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పారు. కరోనా సమయంలో జనసేన కార్యకర్తలు అందించిన సేవలు చాలా గొప్పవని ఆయన ప్రశంసించారు.
ఇవీ చదవండి..
‘ఆచార్య’.. బిగ్ అనౌన్స్మెంట్
ఎన్నికల రద్దు పిటిషన్‌పై రేపు విచారణ