సాగర్‌ ఉప ఎన్నిక: తెదేపా అభ్యర్థి పేరు ఖరారు

తాజా వార్తలు

Updated : 23/02/2021 04:06 IST

సాగర్‌ ఉప ఎన్నిక: తెదేపా అభ్యర్థి పేరు ఖరారు

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్‌.రమణ

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి తమ పార్టీ తరఫు అభ్యర్థిగా మొవ్వ అరుణ్‌ కుమార్‌ను బరిలో దించుతున్నట్టు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే, హైదరాబాద్‌ -రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎల్‌.రమణను అభ్యర్థిగా ప్రకటించారు. మంగళవారం ఆయన నామినేషన్‌ వేస్తారని అరవింద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం అరవింద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని