జలవివాదం ఓ నాటకం: నక్కా ఆనందబాబు

తాజా వార్తలు

Updated : 04/07/2021 06:00 IST

జలవివాదం ఓ నాటకం: నక్కా ఆనందబాబు

గుంటూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఓ నాటకమని తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కొట్టినట్టు నటిస్తాను.. నువ్వు ఏడ్చినట్టు నటించు..’’ అనేలా ఇద్దరు సీఎంల వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకుంటున్న తెలంగాణ.. ఆ నీటిని సముద్రంపాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వల్ల డెల్టా ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తెదేపా అధినేత చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి చూపించారన్నారు. తెలంగాణ వైఖరి వల్ల డెల్టా రైతులకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాయటం ఏంటి? ఈ అంశంపై నేరుగా దిల్లీ వెళ్లి ఎందుకు ప్రధానిని కలవడం లేదు?ఇక మీ నాటకాలు కట్టిపెట్టాలి. లేకపోతే సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. జగన్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అన్యాయం చేస్తోంది. సీఎం కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం చేశారు. మాటల యుద్ధాలు ఆపి ఇద్దరు సీఎంలు కేంద్రంతో చర్చించి వివాదాన్ని పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి’’ అని ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని