నల్గొండ: ఎమ్మెల్సీ తొలి రౌండ్‌ ఫలితాలు విడుదల

తాజా వార్తలు

Updated : 18/03/2021 12:54 IST

నల్గొండ: ఎమ్మెల్సీ తొలి రౌండ్‌ ఫలితాలు విడుదల

నల్గొండ: ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి. 16,130 ఓట్లతో తెరాస సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలిస్థానంలో ఉన్నారు. 12,046 ఓట్లతో తీన్మార్‌ మల్లన్న రెండో స్థానంలో, 9,080 ఓట్లతో తెలంగాణ జనసమితి తరఫున పోటీచేసిన కోదండరాం మూడో స్థానంలో, 6,615 ఓట్లతో భాజపా తరుఫున పోటీచేసిన ప్రేమేందర్‌రెడ్డి నాలుగోస్థానంలో, 4,354 ఓట్లతో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన రాములునాయక్‌ ఐదో స్థానంలో, 1,123 ఓట్లతో రాణిరుద్రమరెడ్డి ఆరో స్థానంలో, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఏడో స్థానంలో, 1,008 ఓట్లతో జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొత్తం 3,85,996 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. తొలిరౌండ్‌లో 56,003 ఓట్లను లెక్కించగా, 3,151 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని