సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొన్న లోకేశ్‌

తాజా వార్తలు

Updated : 31/12/2020 14:08 IST

సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొన్న లోకేశ్‌

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణహత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించారు. అంతకు ముందు ఇంటి నుంచి స్మశానం వరకు సుబ్బయ్య అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ , పార్టీ సీనియర్‌నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుబ్బయ్య అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


అంతిమయాత్రకు ముందు సుబ్బయ్య కుటుంబ సభ్యులను లోకేశ్‌ పరామర్శించారు. మీకు మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని సూచించారు. సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారమే ప్రొద్దుటూరు వెళ్లిన లోకేశ్‌.. ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను నిందితుల జాబితాలో చేర్చాలంటూ ఆందోళన నిర్వహించారు. దాదాపు 3గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. ఆతర్వాత లోకేశ్‌తో చర్చలు జరిపిన పోలీసులు సుబ్బయ్య భార్య స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. కోర్టు ద్వారా ఈ ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. ఆ తరువాత ఆందోళన విరమించిన లోకేశ్‌ రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం నందం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

సీజేఐకి రాసిన లేఖతో జగన్‌కు అనుచిత లబ్ధి

పచ్చని కుటుంబాన్ని కూల్చేసిన కరోనాTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని