అక్కసుతోనే తెదేపా నేతల అరెస్టు: లోకేశ్‌ 

తాజా వార్తలు

Updated : 10/07/2021 09:42 IST

అక్కసుతోనే తెదేపా నేతల అరెస్టు: లోకేశ్‌ 

అమరావతి: లేటరైట్‌ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన తెదేపా నేతల అరెస్టుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఆస్తి లాగా రూ.15వేల కోట్ల బాక్సైట్‌ను సీఎం జగన్‌ వైకాపా నేతలకు రాసిచ్చారని ఆరోపించారు. తన బంధువుల్ని రాబందుల్లా మన్యం పైకి వదిలి వేడుక చూస్తున్నారని ట్వీట్‌ చేశారు. రిజర్వ్‌ ఫారెస్టులో నిబంధనలు ఉల్లంఘించి లాటరైట్‌ ముసుగులో చేపట్టిన బాక్సైట్‌ తవ్వకాన్ని తెదేపా బయట పెట్టిందన్నారు.

విక్రాంత్‌రెడ్డి, అనిల్‌ రెడ్డి మైనింగ్‌ మాఫియాను తెదేపా బహిర్గతం చేసిందన్న అక్కసుతోనే సీనియర్‌ నేతలను అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. తక్షణమే బాక్సైట్‌ మైనింగ్‌ నిలిపేసి పర్యావరణాన్ని, గిరిజనుల హక్కులను కాపాడాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని