ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్‌ సిద్ధమా?: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 02/01/2021 01:01 IST

ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్‌ సిద్ధమా?: లోకేశ్‌

అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తిప్పికొట్టారు. విజయసాయి ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. ఘటన వెనుక తనతో పాటు చంద్రబాబు హస్తముందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డితో సీఎం జగన్‌ దొంగ ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. దీనికి సీఎం జగన్‌ సిద్ధమా? అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ప్రమాణానికి సింహాచలం అప్పన్న సన్నిధికి వస్తే తేల్చుకుందామన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని ఆయన నిలదీశారు. జగన్‌ పార్టీ, హామీలు, పాలన అన్నీ ఫేక్‌ అని లోకేశ్‌ దుయ్యబట్టారు. తనపై దొంగల బ్యాచ్‌తో చేయించే ఆరోపణలు ఫేక్‌ అనే విషయం పింక్‌ డైమండ్‌తోనే తేలిందన్నారు.

ఇవీ చదవండి..

‘కాంగ్రెస్‌, తెరాస ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’ ‌

కొత్త ఏడాది సంప్రదాయాలు ఒక్కో దేశంలో ఒక్కోలా..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని